మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ కవిత … వారికోసం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి సంబరాల సందర్భంగా పటాకులు కాల్చి కంటి గాయాలపాలైన వారి కోసం ఆమె ఆర్థిక సాయం చేశారు. కంటి గాయాలతో సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని సాయంగా ఇచ్చారు. సరోజిని దేవి ఆస్పత్రి అధికారులను కలిసిన కవిత పటాకులు కాల్చి కంటి గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తాను సాయంగా ఇవ్వదల్చుకున్న మొత్తాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు. అంతేగాక కంటి గాయాలైన బాధితులకు సాయంగా వచ్చిన అటెండెంట్లకు మూడు రోజుల పాటు భోజన వసతి కల్పించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.













