రాహుల్ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ పులి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని, పేపర్ పులి మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గాంధీ కుటుంబానికి తెలంగాణకు మధ్య విద్రోహక సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరిచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ హాయంలోనే న్యాయం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బీడి కార్మికులకు పనికొచ్చే విధంగా ఉందన్నారు. ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్‌లో చనిపోయిన వారికి ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణ ప్రకటించారని గుర్తు చేశారు.













