రైతుల నోటీకాడ ముద్దను లాగేశారు.. కాంగ్రెస్‌పై కవిత ఫైర్
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులపై ద్వేషాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలు గుర్తించాలని చెప్పారు. ‘రైతుబంధు కావాలా? లేదంటే రాబందులు కావాలా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల నిధులు ఆపేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే తెలంగాణ రైతులకు రైతు బంధు నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ ఇటీవలే అనుమతించింది. కానీ దీని గురించి ఒక నేత ఎన్నికల ప్రచారంలో మాట్లాడటంతో వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని, నిధులను అడ్డుకుంది. ఈ విషయాన్ని చెప్పిన కవిత.. తెలంగాణ రైతుల నోటి కాడ ముద్దను కాంగ్రెస్ నేతలు లాగేశారని ఆరోపించారు.













