అది గిఫ్ట్ కాదు.. పోరాడి తెచ్చుకున్నాం
ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదన్నారు. అది గిఫ్ట్ కాదు, పోరాడి తెచ్చుకున్నామని అన్నారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని మాణికం ఠాకూర్‌కు కవిత హితవు పలికారు.













