ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు
నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్నుగౌడ్ తాను అభిమానించే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని బంగళాఖాతం సముద్రపు అంచుల్లోకి వెళ్లిన ఆయన నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను టీఎస్ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ విడుదల చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడులను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణరెడ్డి నాయకత్వంలో వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు.













