బతుకమ్మ సంబురాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 21న యూకే (ఇండ్లండు)లో జరగనున్న బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఏటా భారత జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్న భారత జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. బతుకమ్మ వేడుకలను హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యూకే విభాగాన్ని కవిత అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భారత జాగృతి యూకే అధ్యక్షుడు బల్మురి సుమన్, టీఎస్ ఫుడ్ చైర్మన్, భారత జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.













