భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్ గా ఎమ్మెల్సీ కవిత
భారత స్కాట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత స్కాట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత గైడ్స్ కమిషనర్‌గా ఏడాది పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కాట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్మీ కవిత సేవలందిస్తూ, స్కాట్స్ అండ్ గైడ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కాట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తామని కవిత తెలిపారు.













