రితీష్ అమెరికా చదువులకు.. ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సాయం
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత అందించారు. సాముల రితీష్ అనే విద్యార్థి అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ సీటు లభించింది. చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రితీష్ తండ్రి అమెరికాకు తన కొడుకును పంపించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రితీష్ ఎమ్మెల్సీ కవితకు తెలియజేయడంతో సాయం చేయడానికి ముందుకు వచ్చి అండగా నిలిచారు. రితీష్ ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత వెంటనే అమెరికాకు వెళ్లడానికి అయ్యే ఖర్చులను తాను ఇస్తానంటూ స్పష్టం చేశారు. వారికి తన సొంత డబ్బులతో టికెట్స్ను కొనిచ్చారు. ఉన్నత చదువులకు తాను సహాయం చేస్తానంటూ వెల్లడిరచారు. తన కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలబడిన ఎమ్మెల్సీ కవితను కలిసిన రితీష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.













