ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేబినెట్ ర్యాంక్ పదవి ?
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డికి క్యాబినెట్ ర్యాంకు పదవి ఖరారు అయినట్లు చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ స్థానాలతోపాటు, 6 పెండిరగ్ మంత్రి పదవులు భర్తీ అంశంపై కాంగ్రెస్ అగ్రనాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంకు గల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. సీనియార్టీ, పార్టీకి విధేయత, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకు అంశం, అధిష్ఠానం నిర్దేశించిన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం తదితర అంశాలతో పాటు ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో ఆయన ప్రసంగాన్ని జీవన్ రెడ్డి తెలుగులో అనువదించడం, ఎన్నికల సభలోనే రాహుల్ గాంధీ జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడం తదితర అంశాలు కేసీ వేణుగోపాల్ వద్ద చర్చకు వచ్చినట్లు సమాచారం. జీవన్ రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం కల్పించడానికి మరో ప్రధాన కారణంగా కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికలు అనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.













