గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా …కుర్రా, దాసోజు
తెలంగాణ రాష్ట్రంలోని గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్ స్థానాలకు అభ్యర్థులను మంత్రిమండలి ఎంపిక చేసింది. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ల పేర్లను ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి మథనం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ రెండు స్థానాలకు పదవీకాలం మే నెలాఖరుకే ముగియగా, శాసనసభ ఎన్నికలు ముందుకు జరుగుతున్న ఎంపిక దృష్ట్యా ఆచితూచి వ్యవహరించాలని మంత్రి మండలి నిర్ణయించింది. సామాజికవర్గాల వారీగా అధ్యయనం చేసి ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.













