ఎమ్మెల్సీ ఎన్నిలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కోటాలో నల్లగొండ, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, వుల్లోల్ల గంగాధర్ గౌడ్, కుర్మయ్యగారి నవీన్ కుమార్ల పదవీ కాలం మార్చి 29 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ ఉంటుంది.













