సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను కలిశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. రాయచూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆర్టీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దీనిపై వెంకటరామిరెడ్డి స్పందించలేదు.