తెలంగాణలో ముగిసిన ప్రచారం

ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి ( బీఆర్‌ఎస్), ప్రేమేందర్ రెడ్డి ( బీజేపీ) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.