ఆ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా .. సీతక్క ఫైర్
మణిపూర్లో జరుగుతున్న దారుణ ఘటనలపై ప్రధాని మోదీ తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ అక్కడ దారుణాలు జరుగుతున్నా, తనకెమీ తెలియనట్లు మాట్లాడటం శోచనీయమన్నారు. మణిపూర్ ఘటనపై 79 రోజుల తర్వాత మోదీ మౌనం వీడారన్నారు. కుకీతెగపై దాడులు, హత్యాచారాలు బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో రాహుల్ పర్యటనను బీజేపీ సర్కారు అడ్డుకుందని అన్నారు. మనదేశంలో జరుగుతున్న సంఘటనలా అని భయపడేట్టుగా మణిపూర్లో పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీవి ఓటు బ్యాంకు రాజకీయాలు. మణిపూర్ ఘటన సభ సమాజం తలదించుకునేలా ఉంది. ఇదే సమయంలో డబుల్ బెడ్రూం సమస్య పేరుతో బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు.













