రేవంత్ రెడ్డికి పదవి వచ్చిందని .. మొక్కు చెల్లించుకున్న

మల్యాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీపీ పీఠం దక్కడంతో సమ్మక్క సారలమ్మలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క తన మొక్కు చెల్లించుకున్నారు. పీసీసీ చీఫ్‍గా రేవంత్ రెడ్డి నియమితులవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె.. మేడారం వెళ్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లిన సీతక్క.. ప్రదక్షణ అనంతరం అమ్మవార్లకు మొక్కు చెల్లించారు. రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం దక్కడంపై పలువురు కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.