కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ్ముడి తరపున ప్రచారం చేస్తున్న వెంకట్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. వెంకట్ రెడ్డి ఓ దుర్మార్గుడు అని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేయడం ఎంత వరకు సరైనది అని ప్రవ్నించారు. కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు. బంధాలకతీతమే రాజకీయాలు, నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు, సిద్దాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. తమ్ముడి గెలుపే ముఖ్యమైతే కాంగ్రెస్ కండువాను తీసి పక్కనపెట్టి, బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.













