ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరికొంత సమయం ఇవ్వండి
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్ఠానానికి లేఖ రాశారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎందుకు బహిష్కరించూకూడదో పదిరోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ గడువు రేపటితో (సెప్టెంబర్ 2) ముగియనున్నందున బీజేపీ క్రమశిక్షణ కమిటికీ ఉషాబాయి లేఖ రాశారు. రాజాసింగ్ జైలులో ఉన్నారని, తన సస్పెన్షన్ రేపటితో ముగియనుండటంతో సమయం ఇవ్వాలని కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేల రాజాసింగ్‌ను ఇటీవల పీడీ చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్ చేసిన బీజేపీ 10 రోజుల్లో సమాధానం చెప్పాలని రాజాసింగ్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.













