రాజాసింగ్ సంచలన ఆరోపణలు…. ఈ వ్యవహారంపై సీబీఐతో
హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారికి కూడా సర్టిఫికెట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటుదారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖ్యానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.













