నా ప్రాణాలకు ముప్పు… పాకిస్థాన్ నుంచి
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డీజీపీ కి లేఖ రాశారు. తనకు ఎనిమిది నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అన్న ప్రతిసారీ తనపై ఎఫ్ఐఆర్ బుక్చేసే పోలీసులు ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గన్ లైసెన్స్ కోసం ఇప్పటికే చాలాసార్లు అభ్యర్థన పెట్టుకున్నానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. అయితే తనపై కేసులు ఉన్నాయని గన్ లైసెన్స్ ఇవ్వడం లేదన్నారు. కేసులు ఉన్నా కూడా గన్ లైసెన్స్ పొందిన వ్యక్తులు ఉన్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుమని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.













