మేం తలచుకంటే.. మీలా చేయగం… కానీ చేయం
ప్రశ్నించే గొంతును లేకుండా చేయాలని తాము అనుకోవట్లేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేం తలచుకుంటే మీలా చేయగలం కానీ చేయం అని వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని అనుకోవట్లేదన్నారు. బీఆర్ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను దారిలో పెడతామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు కష్టించి పనిచేస్తారు కానీ ఏం లాభం? ఆయన మంత్రి అయిన నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే. కేసీఆర్, కేటీఆర్ మాటలు వినడం ఆపి మా మాటలు వినాలి అని అన్నారు.













