కోమటిరెడ్డి వ్యాఖ్యల పై … జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు, పార్టీలో కోవర్టులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్లు, సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుతూంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్ అన్నారు. బీజేపీకి మాపై ఆరోపణలు చేసే అర్హత లేదు అన్నారు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోరాటం అని స్పష్టం చేశారు.













