కోటి మంది మహిళలు ఎదురుచూస్తున్నారు : హరీశ్‌రావు

మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అలా లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా మహిళలకు ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. కోటి మంది మహిళలు నెలకు రూ.2,5000 సాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని ఇప్పటికీ పెంచలేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.