IT హబ్ పనులని IT Serve అలైన్స్ ప్రతినిధులతో కలిసి పరిశీలించిన గణేష్ బిగాల మరియు మహేష్ బిగాల
IT హబ్ పనులని IT Serve అలైన్స్ ప్రతినిధులతో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS పార్టీ NRI సెల్ కో-ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు…
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు, TRS పార్టీ NRI సెల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు అమెరికా నుండి వచ్చిన NRI బృందం తో కలిసి IT హబ్ పనులని పరిశీలించారు.
* అనంతరం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ యూనివర్శిటీ VC రవీందర్ గుప్తా, నిజామాబాద్ జిల్లా కాలేజి అసోసియేషన్ సభ్యులు, అమెరికా NRI బృందంతో కలిసి సమావేశం నిర్వహించారు.
* సమావేశం అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మీడియా తో మాట్లాడుతూ..
* ద్వితీయ శ్రేణి నగరాల్లో IT ని విస్తరించాలని స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని IT హబ్ ని నిజామాబాద్ లో నిర్మిస్తున్నాము.
* మా సోదరుడు శ్రీ మహేష్ బిగాల గారి సహకారంతో అమెరికాలో పర్యటించి కొన్ని ప్రిలిమినరీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని రావడం జరిగింది.
* ఈరోజు న్యూ కలెక్టరేట్ రోడ్డులో 50 కోట్ల రూ. లతో నిర్మిస్తున్న IT హబ్ పనులని అమెరికా నుండి వచ్చిన NRI బృందంతో కలిసి పరిశీలించి ఇక్కడున్న Infrastructure వారికి వివరించడం జరిగింది.
* NRI బృందం సభ్యులు ప్రవీణ్ (Vitel Global CEO) , Kakathiya Sand Box మనీష్ జైస్వాల్ గారి సూచన మేరకు తెలంగాణ యూనివర్సిటీ VC రవీందర్ గుప్త, స్థానిక కాలేజీలతో సమావేశం నిర్వహించాము.
* స్థానికంగా ప్రతిభ కలిగిన ఎలా రిక్రూట్ చేసుకోవాలి. ఏ విధమైన శిక్షణ విద్యార్థులకు ఇవ్వాలి అనే అంశాలపైన చర్చించాము.
* మా సోదరుడు శ్రీ మహేష్ బిగాల గారు NRI సెల్ కో ఆర్డినేటర్ సహకారం తో జూన్ నెలలో మరల అమెరికాలో పర్యటించి మరి కొన్ని కంపెనీల స్థాపనకు కృషి చేస్తాము.
* ఈ రోజు నిజామాబాద్ పర్యటనకు వచ్చి IT కంపెనీల స్థాపన కొరకు ముందుకు వచ్చిన ప్రతినిధులు ప్రవీణ్, మనీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.













