దీనిపై బహిరంగ చర్చకు.. కాంగ్రెస్ నేతలు సిద్ధమా ? : గండ్ర
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన మాటతీరు మార్చుకోవాలని లేకుంటే సహించేది లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హథ్సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ తమపై చేసిన ఆరోపణలను వారు ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తామని, కాంగ్రెస్ నేతలు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గురువారం ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేడ్కర్ సెంటర్‌కు తాము వస్తామని కాంగ్రెస్ నేతలు ఆధారాలతో రావాలని కోరారు. తాము విసిరిన సవాల్‌ను స్వీకరించాలన్నారు. భూపాలపల్లిలో రేవంత్, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర భూ అక్రమాలు, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.













