అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నయన్నారు. ఆరు పథకాలు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టు తిరుగతూ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.













