తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్లోని బస్భన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేశ్ గుప్తా తదితరులు హాజరయ్యారు.













