ఎమ్మెల్సీగా రహమత్ బేగ్ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) ఎ.ప్రియాంక ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఈ నెల 25న జరిగిన నామపత్రాల పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చెల్లుబాటు కాలేదు. ఎంఐఎం అభ్యర్థి మాత్రమే బరిలో మిగిలారు. దీంతో ఆర్వో కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తీసుకుని రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ద్రువపత్రం అందజేశారు.













