రాజ్‌భవన్‌తో బీజేపీకి ఏం సంబంధం? : మంత్రి హరీష్ రావు
రాజ్‌భవన్‌తో బీజేపీకి ఏం సంబంధం? అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం తమకు లేదని అన్నారు. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని బీజేపీ అనడం దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లుగా ఉందని మండిపడ్డారు. రాజ్‌భవన్‌కు కాషాయ రంగు ఎందుకు పూస్తున్నారు? అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాగానే గుజారత్ గవర్నర్ కమలాబేణి వాల్‌ను డిస్మస్ చేశారని అన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల అందరూ మాతృమూర్తులను అవమానించారని గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని కూడా తెలియదా? అని ప్రశ్నించారు. కేసులు తమ మీద కాదు, మీ మీదే పెట్టాలని అన్నారు. ఇది కొత్త సెషన్ కాదన్న విషయం కూడా సంజయ్‌కు తెలియదని విమర్శించారు. సంజయ్ నీ పార్టీలో అసమ్మతి పెరిగిందని, ముందు అది సరిచేసుకోమని సూచించారు.













