అలా అయితే మొదట మీరే రాజీనామా చేయాలి
రాజకీయ నాయకులైతే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనికిరారా? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి నుంచి నేరుగా గవర్నర్ కాలేదా? అని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫార్సులు పాటించాలని గతంలో చెప్పిన ప్రధాని మోదీ, వాటిని తుంగలో తొక్కి మిమ్మల్ని గవర్నర్ చేయాలేదా? మీకు నైతికత ఎక్కడిది? అలా అయితే మొదట మీరే రాజీనామా చేయాలని అని అన్నారు.













