ఏఈ, డీఈకి మంత్రి ఉత్తమ్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో నీటిపారుదల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ల పనితీరుపై పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రైతులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఏఈ, డీఈని హెచ్చరించారు. అలాగే, హుజూర్‌నగర్ డీఈ నవీన్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.