Minister Uttam: ఈ ఏడాది ప్రజాపాలనలో ప్రజలకు మంచి చేశాం : ఉత్తమ్

తెలంగాణకు 2024లో చాలా మంచి జరిగిందని, ప్రజాపాలనలో ప్రజలకు మంచి చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. నల్గొండ లోక్‌సభ(Nalgonda Lok Sabha) స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy ) తో కలిసి ఉత్తమ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖలో పూర్తి పారదర్శకత విధానాలు అమలు చేస్తున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.