మలేసియా మంత్రితో తుమ్మల భేటీ.. త్వరలోనే

తెలంగాణలో ఆయిల్‌పామ్ విస్తరణ, శుద్ధి పరిశ్రమల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఉత్పాదకాల అభివృద్ధికి మలేసియా ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆయిల్‌పామ్ అధ్యయనం కోసం తమ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మీన్ బాషాలతో కలిసి మలేసియాకు వెళ్లిన మంత్రి తుమ్మల, ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి జోహరి అబ్దుల్ ఘనీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని, వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తామని ఈ సందర్భంగా అబ్దుల్ ఘనీకి మంత్రి వివరించారు. ఆయిల్‌పామ్ అభివృద్ధికి మలేసియాను ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. ఘని మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడం కోసం త్వరలోనే తమ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపిస్తామన్నారు.