5 నుంచి చేపపిల్లల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. 5వ తేదీన సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రెండో విడుత పాడి గేదెలు, గొర్రెల పంపిణీని త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెలు మరణిస్తే బీమా పరిహారం కింద మరో జీవాన్ని కొనుగోలు చేసి ఇస్తున్నామని తెలిపారు. 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే జీవాలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టామన్నారు.













