అది సాధ్యం కాకపోతే పబ్బులు మూసివేయాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. పబ్బుల యజమానులు, ఎక్సైజ్ సిబ్బందితో మంత్రి సమావేశమయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ధ కాలుష్యంపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పబ్బుల్లో పాటించాల్సిన నియమాలు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పబ్బుల్లో జరుగుతున్న కార్యకలాపాలను యాజమాన్యాలు గమనించాలన్నారు. అది సాధ్యం కాకపోతే పబ్బులను మూసివేయాలన్నారు. శబ్ధ కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులకు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ కనిపిస్తూ 1800 425 2523 నెంబర్‌కు తెలుపాలని ప్రజలకు సూచించారు.













