దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు
అట్టడుగు వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దేశంలోనే తొలిసారిగా మద్యం వ్యాపారంలో రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది తాజా ఉదాహరణ అని కొనియాడారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అములులోకి రానున్నదని అన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడొచ్చునని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీని 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ప్రివిలైజ్ ఫీజును 7 రెట్లు అమ్మకాలను పెంచినట్లు చెప్పారు. స్థానికులకే దుకాణాలు దక్కేలా చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.













