నాకు ఆ అర్హత ఉంది.. కానీ నాపై తప్పుడు ప్రచారం
మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రీడమ్ ర్యాలీలో జనం మధ్య తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హుషారుగా తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో మంత్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని తుపాకీని మంత్రి గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదని విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసుల ఎస్ఎల్ఆర్ వెపన్తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన ప్రకటన ఇచ్చారు. నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌ను. క్రీడా శాఖ మంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎస్పీ ఇస్తే నేను కాల్చాను. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన.













