విదేశీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ.. పరిశ్రమల ఏర్పాటుకు
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వ పరంగా కూడా సహకారం ఉంటుందని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విదేశీ యువ పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర యువజన, పర్యాటక, ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. సచివాలయంలో తన ఛాంబర్లో యూత్ అంబాసిడర్ ప్రోగ్రాంలో భాగంగా ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్‌కు చెందిన 13 మంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ కుటుంబాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో మంత్రి భేటీ అయ్యారు. సంస్కృతి, సంప్రదాదాయలపై అధ్యయనంలో భాగంగా మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రిని కలిసిన వారిలో యూత్ అంబాసిడర్స్ కో ఆర్డినేటర్ నవీన్ మల్వే, జర్మనీ చెందిన రాబిన్ టిబర్షియస్, లూకాస్ వెబర్, ఫిన్ బోల్టా, మివా జుంగాన్స్, ప్రాంజిస్కా వీసర్, మారా క్రామర్, ఆస్ట్రియాకు చెందిన జూలియా ఫేజర్, బెల్జియంకు చెందిన టిమ్ కాలిన్, ఫిన్లాండ్కు చెందిన విల్మా లైనీ, స్వీన్నె స్మిత్, నెదర్లాండ్స్, డెన్మార్క్ కు చెందిన ఎమ్మా లిండే, జేకబ్సన్, ఇదా గోల్ జెమ్మెన్, ఇటలీకి చెందిన ఫిలిప్ కోరెయిన్ ఉన్నారు.













