ఎలాన్ మస్క్ కు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

భారత్‌కు వస్తోన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలంగాణకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. దేశంలోనే యంగ్ స్టేట్ అయిన తెలంగాణ మీకు స్వాగతం పలుకుతోందని మంత్రి ఆహ్వానించారు. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ భారత్‌లో పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని మాస్క్ ఇప్పటికే తన పర్యటన వివరాలను ప్రకటించారు. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు రెండు బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న నేపథ్యంలో దీనికి తెలంగాణ అనువైన ప్రాంతమని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.