దీపావళి తర్వాత మరో 4 లక్షల మందికి : మంత్రి సీతక్క

రెండు మూడు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, దీపావళి పండుగ తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఏజెన్సీలో సాగుచేసుకుంటున్న గిరిజన రైతుల భూములకు పట్టాలు ఇస్తామన్నారు. రైతులు ఎవరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మీకు భూమి పట్టాలు చేయిస్తామంటూ దళారులు వస్తున్నారని, ఎవరిన నమ్మకండని ప్రభుత్వమే అర్హులకు పట్టాలు ఇస్తోందని స్పష్టం చేశారు.