మేడారం జాతర విజయంవంతం. 1.35 కోట్ల మంది భక్తులు
మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయిచిందని వెల్లడిరచారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పని చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా మా వంతు కృషి చేశాం. జాతరకోసం ఆర్టీసీ దాదాపు 6 వేల బస్సులను కేటాయించి, 12 వేల ట్రిప్పులు నడిపింది. మహాజాతరకు వచ్చిన భక్తుల్లో 5090 మంది తప్పి పోయారు. వారిలో 5062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తాం. తప్పిపోయిన వారి వివరాల కోసం మీడియాపాయింట్, జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన మిస్సింగ్ పాయింట్లో సంప్రదించాలి. సోమవారం నుంచి మేడారంలో పది రోజుల పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతాయి. ఇందుకోసం దాదాపు 4 వేల మంది కార్మికులను నియమించాం అని తెలిపారు.






