గవర్నర్ కు మంత్రి సీతక్క ఆహ్వానం.. మేడారం జాతరకు రండి
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆహ్వానించారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన సీతక్క ఆహ్వాన పత్రికతోపాటు చీరను అందజేశారు. కాగా ఈసారి ఆహ్వాన పత్రికలను బాక్స్ రూపంలో ప్రత్యేకంగా తయారు చేయించారు. వనదేవతల గద్దెలను ప్రతిబింబించేలా రూపొందించిన ప్రతిమలు, పసుపు, కుంకుమ, ఆహ్వాన పత్రిక అందులో ఉన్నాయి.













