బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు : సీతక్క
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం మంచి నీరూ అందించలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క మండిపడ్డారు. మంచిర్యాలలో ఆమె మీడియాతో రెండు పంటలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు కూడా ఇక్కడ లేవన్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇస్తే గులాబీ నేతలు సహించలేకపోతున్నారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివాసి బిడ్డనైన తనకు ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం అదృష్టమన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.













