Seethakka: యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు : మంత్రి సీతక్క

పార్లమెంటులో అంబేడ్కర్‌ను, అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. అసెంబ్లీలో ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్ ఆమోదం తీసుకొని ఫార్ములా ఈ`రేసుకు కేటీఆర్ (KTR) డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు అని అడిగారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని చెప్పారు. బీఏసీ(BAC) లో ఫార్ములా ఈ రేసు మీద చర్చ కోసం బీఆర్‌ఎస్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ముసుగు వేసుకుని బీఆర్‌ఎస్ (BRS) రాజకీయం చేస్తోందని విమర్శించారు.
జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చు కదా? కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టు వెళ్తే తప్పుటిన ఆయన ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేటీఆర్‌కు నిజాయతీ లేదు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే భూ భారతి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. వాళ్ల భూ కబ్జాల బాగోతం బయట పడుతుందనే ఇలా చేస్తున్నారు. అందరు చట్టం ముందకు సమానులే. ఫార్ములా- ఈ రేసు కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని తెలిపారు.