ప్రజల ప్రాణాలు, భద్రతలో రాజీ పడబోం : మంత్రి సీతక్క
కాళేశ్వరం (Kaleshwaram) అంశంపై బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ( Medigadda Barrage) అంశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎసఏ) నివేదికనే ప్రభుత్వం అనుసరిస్తోంది. నిపుణులు అనుమతి ఇస్తేనే నీటిని ఎత్తిపోస్తోం . కాళేళ్వరం నిర్మాణంలో అనేక లోపాలు, అవినీతి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. మేడిగడ్డలో ప్రమాదం జరిగితే గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. రైతుల పేరుతో ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజల భద్రతలో ప్రభుత్వం ఎలాంటి రాజీపడబోదు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ ముందు వాదనలు వినిపించాలి అని అన్నారు.








