పీ4ను ప్రపంచానికి అందిస్తాం : చంద్రబాబు
ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే పీ4 ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. దీన్ని ఆదర్శ కార్యక్రమంగా ప్రపంచానికి అందిస్తామని తెలిపారు. సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam constituency)లో పర్యటించిన సీఎం, పీ4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. ఏడాదిలో సాధించిన పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 శాత మంది కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. బంగారు కుటుంబాలను పైకి తీసుకురావడానికి మారదర్శులుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో తెలపాలని కోరగా టీవీఎస్ (TVS), మేఘా ఇంజినీరింగ్ (Megha Engineering) అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అందరూ కలిసి వస్తే అనుకున్న లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.








