మేడారం సమ్మక్క, సారలమ్మలకు అరుదైన కానుక సమర్పించిన మంత్రి సీతక్క
తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి కేరళ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా మేడారంలో సమ్మక్క, సారలమ్మ వనదెవతలకు సమర్పించారు. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివారెడ్డి తెలిపారు. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మంత్రి చేతుల మీదుగా అమ్మలకు నూతన వస్త్రాలు చందన సుగంధ మాలలు సమర్పించారు.













