ఆ విషయం రాష్ట్ర పరిధిలో ఉంటే.. కేంద్రం ఎందుకు?
గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదే విషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేపినప్పుడు బీజేపీ శాసనసభా పక్షా నాయకుడు కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకుంటే కేంద్రం అడ్డుపడకుండా బాధ్యత తీసుకుంటాన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటే ఈ రిజర్వేషన్లను రాష్ట్ర పరిధిలో 10 శాతం పెంచుకోవచ్చని కేంద్రం నుంచి అధికారికంగా సమాధానం ఇప్పించాలని డిమాండ్ చేశారు













