ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిస్తే… ఏం జరిగిందో తెలుసుకోవాలి
ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిస్తే ఏం జరిగిందో తెలుసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు మహిళలంటే గౌరవం అని అన్నారు. గవర్నర్, బీజేపీ నేతలను కలిసి మాపై విమర్శలు చేయడం, తాను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందడనం సరికాదన్నారు. వందమందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఎలా కూలుస్తారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రొరోగ్ కానందునే బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం. గవర్నర్కు అవమానం జరిగితే ఇక్కడే మాట్లాడాల్సిందన్నారు. ప్రధాని, కేంద్ర హోంత్రి కలిసి ప్రభుత్వాన్ని బెదిరించినట్టు మాట్లాడారు.
బీజేపీ కార్యకర్త మాదిరిగా గవర్నర్ మాట్లాడినట్లు భావిస్తున్నామన్నారు. రోడ్డు మార్గం ద్వారా మేడారం వెళ్లాను, శ్రీరామనవమికి భద్రాద్రి రోడ్డు మార్గం ద్వారా వెళ్తాను అని గవర్నర్ చెబుతున్నారు. రోడ్డుపై వెళ్లినంత మాత్రాన హోదా తగ్గదు. వారి ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీ తరపున అనే మార్లు పోటీ చేసి ఓడిన ఆమె వేరొకరిని రాజకీయాల నుంచి వచ్చారు కాబట్టి ఆమోదించలేదని చెప్పడం బాధాకరం అని అన్నారు.













