తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు : మంత్రి సబితా
తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తొమ్మిదేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి నెంబర్‌వన్‌గా నిల్చిందని అన్నారు. నిరంతరం ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.













