కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై గవర్నర్కు వివరణ ఇచ్చిన మంత్రి సబిత
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. ఈ మీటింగ్లో మంత్రితోపాటు సంబంధిత అధికారులు కూడా హాజరయ్యారు. యూనివర్సిటీల్లో నియామకాల కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లుపై గవర్నర్కు మంత్రి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో యూజీసీ నిబంధనల ఎలా అమలు చేస్తాం? న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై గవర్నర్ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ బిల్లుకు సంబంధించి అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రస్తుతం వర్సిటీ నియామకాల విధానంలో ఉన్న ఇబ్బందులు, కొత్త విధానంతో వచ్చే సౌలభ్యం తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీల్లో నియామకాలు త్వరగా, సజావుగా సాగేందుకు తాము తీసుకోనున్న విషయాలపై గవర్నర్కు నివేదిక అందజేశారు.













